- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండు తిన్నదని.. ఆవును కత్తితో పొడిచాడు!
దిశ, వెబ్‌డెస్క్ : మనుషులు రానురాను సహనాన్ని పూర్తిగా కోల్పోతున్నారు. చిన్న చిన్న విషయాలకే హైపర్ రియాక్ట్ అయిపోయి క్షమించరాని నేరాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా జైలు పాలవుతున్నారు. దీనంతటికి మానసిక ఆందోళనలే కారణమని నిపుణులు చెబుతున్నారు. తరచూ మానసికంగా ఆందోళనకు గురయ్యే వారు చిన్న విషయాలకే విపరీతమైన కోపం ప్రదర్శిస్తుంటారు. ఆ సమయంలో వారు ఎంచేస్తున్నారో కూడా అర్థం కాకపోవచ్చు. తీరా జరగాల్సిన నష్టం జరిగిపోయాక పశ్చాత్తాపడుతుంటారని తేలింది. మానసికంగా ఫిట్‌గా లేనివారు ఎప్పుడూ అదేపనిగా ఆలోచిస్తుంటారు. ఫలితంగా నిద్రలేమి వెంటాడుతుంది. దీంతో ఎప్పుడు కోపం, చిరాకు వీరి జీవనంలో భాగమైపోతాయి.
ఇలాంటి లక్షణాలతో బాధపడే వారే ఇటీవల నమోదవుతున్న నేరాల్లో నిందితులుగా ఉంటున్నారని సమాచారం. వీరిలో ముఖ్యంగా 25 నుంచి 35ఏళ్ల లోపు వారే అధికంగా ఉండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని రాయ్‌గడ్ నమోదైన ఓ క్రైమ్ దీని కిందకే వస్తుంది.
‘తోఫిక్ బషిర్ ముజవార్’ అనే వ్యక్తి స్థానికంగా పండ్ల వ్యాపారం నిర్వహించేవాడు. ఆ చుట్టుపక్కల పశువులు ఆహారం కోసం ఎక్కువగా సంచరిస్తుంటాయి. అవి పండ్లను తినకుండా చూసుకుంటునే ఇటు కస్టమర్లను చూసుకోవడం బషిర్‌కు పెద్ద టాస్క్‌గా మారింది.ఈ క్రమంలోనే కస్టమర్లతో మాట్లాడుతున్న సమయంలో ఓ ఆవు బండిలోని బొప్పాయి పండును తినింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తోఫిక్ పక్కనే ఉన్న కత్తి తీసుకుని ఆవు పొట్టలో కసితీరా పొడిచాడు. తీవ్రరక్తస్రావంతో ఆవు ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న ఆవు యాజమాని పండ్ల వ్యాపారిపై పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించారు. అంతకుముందు తాను కావాలని ఈ నేరం చేయలేదని, క్షణికావేశంలో జరిగిపోయిందని విచారణలో భాగంగా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.