శుక్రవారం పంచాంగం, రాశిఫలాలు (07-05-2021)

by Hamsa |
Panchangam Rasi phalalu
X

శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం బహుళ పక్షం
తిధి : ఏకాదశి సా 3.34 తదుపరి ద్వాదశి
వారం : శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : పూర్వాభాద్ర మ 12.26 తదుపరి ఉత్తరాభాద్ర
యోగం : వైధృతి రా 9.26 తదుపరి విష్కంభం
కరణం : బాలువ సా5.29 తదుపరి కౌలువ
వర్జ్యం : రా 12.42 – 2.24
దుర్ముహూర్తం : ఉ 8.21 – 9.13 &
మ 12.38 – 1.29
అమృతకాలం : ఉ 6.11 – 7.51
రాహుకాలం : ఉ 10.30 – 12.00
యమగండం/కేతుకాలం : మ 3.00 – 4.30
సూర్యరాశి : మేషం ||
చంద్రరాశి : కుంభం ఉ.5.55 వరకు తదుపరి మీనం
సూర్యోదయం : 5.47 || సూర్యాస్తమయం : 6.38

మేష రాశి : స్థిరాస్తుల కొనుగోలుకు ధనం ఖర్చు చేస్తారు. భరణి నక్షత్రము వారు ముఖ్యమైన కార్యాలకు తాగిన నిర్ణయం తీసుకోవటానికి మంచి తరుణం. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. అవివాహితులు అయిన అమ్మాయిలకు మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆధ్యాతిక, సామాజిక కార్యక్రమాలలో ఉత్సాహంతో పాల్గొంటారు.

వృషభ రాశి : ఆర్థికంగా పుంజుకుంటారు. సంతాన విద్యా విషయమై శక్తికి మించి ఖర్చు చేస్తారు. విద్యా సంబంధమైన పోటీ పరీక్షలలో ఎంతో శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. స్వగృహం ఏర్పరచుకోవాలి అనే కోరికకు అనుగుణంగా ప్రయత్నాలు చేస్తారు.

మిధున రాశి: ఆర్థిక పురోగతి బాగుంటుంది. విద్యార్థులకు మంచి సమయం. ఉన్నత పరీక్షలలో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు మీ పరపతిని, పలుకుబడిని వారి స్వార్ధానికి వాడుకుంటారు. స్త్రీల వల్ల మేలు జరుగుతుంది. ఈ రాశి ఆడవారికి ముఖ్యంగా సంతాన ప్రాప్తి కలిగే అవకాశం.

కర్కాటక రాశి : విద్య, ఆర్థిక సంబంధిత విషయాలలో అనుకూలమైన సమయం. ప్రభుత్వ పరంగా చిక్కులు రావటానికి అవకాశం. దాని వలన అనవసర భయాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అధిక శ్రమ, ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. మహాలక్ష్మి పూజ, దర్శనం వలన మంచి జరుగుతుంది.

సింహ రాశి : ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కరోనా వలన వ్యాపారం దెబ్బతినడం తిరిగి వ్యాపారాన్ని ప్రారంభించడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడం వల్ల విచారం కలుగుతుంది. భార్య/భర్త యొక్క ఆరోగ్య విషయంలో లేనిపోని భయాలు, ధన వ్యయం మరియు మృత్యు భయం. ఆంజనేయ స్వామి ఆదరణ వలన మనశ్శాంతి.

కన్య రాశి : ఉద్యోగస్తులకు ఇప్పటివరకూ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. స్త్రీల వలన కొన్ని ప్రయోజనాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరగడానికి అవకాశం. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకు ఉన్నత విద్యను అభ్యసించడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి.

తులారాశి : అవివాహితులకు వివాహం కుదిరే అవకాశం. జీవిత భాగస్వామి పేరు మీద మీరు చేసే వ్యాపారం లాభిస్తుంది. రోజూవారీ ప్రయాణాలలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ధనలాభం ఉండే అవకాశం. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టం జరిగే అవకాశం. జాగ్రత్త అవసరం.

వృశ్చిక రాశి : సంతానం పురోగతికి అధికంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. దైవానుగ్రహం వలన మీకు అపకారం చేస్తున్న దుర్మార్గులకు తగిన శాస్తి జరిగే అవకాశం. కీళ్ళ నొప్పులు బాధిస్తాయి. నకిలీ స్వామీజీలు నమ్మి మోసపోయే అవకాశం. ఈ రాశి స్త్రీలకు కళా సాంస్కృతిక రంగాలలో గుర్తింపుకు అవకాశం.

ధనుస్సు రాశి : వృత్తి,ఉద్యోగాల పరంగా అభివృద్ధి, స్థిరత్వం కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకున్నంత గొప్పగా ఉండదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన విషయాలు రహస్యంగా ఉంచండి. దాని వలన భవిష్యత్తులో ఎంతో లాభం. ఈ రాశి స్త్రీలకు మంచి ఉద్యోగం లభించే అవకాశం.

మకర రాశి : ధన లాభం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో స్వల్ప జాగ్రత్తలు అవసరం. తల్లిదండ్రులతో, పెద్దపులితో విభేదాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించ వలసి ఉంటుంది.జ్యేష్ఠ సంతానం వలన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వారితో మనసు విప్పి మాట్లాడండి. ఈ రాశి ఆడవారు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

కుంభ రాశి : దూర ప్రయాణాలకు, విద్యా సంబంధమైన విషయాలకు, పెట్టుబడులకు ధనవ్యయం చేసే అవకాశం. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కీళ్ళనొప్పులు బాధిస్తాయి. కరోనా వలన ఎటువంటి ఇబ్బందులు లేవు. సంతానం పేరు మీద స్థిరాస్తులు కొంటారు.

మీన రాశి: మంచి భోజన ప్రాప్తి. సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఇతరుల పేరు మీద మీరు చేసే వ్యాపారాలలో నష్టం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. సంతానం పురోగతికై అధికంగా ఖర్చు చేయవలసి ఉంటుంది.

శ్రీ యనమండ్ర శ్రీనివాస శర్మ,
మొబైల్: 7671939471,
హైదరాబాద్.

Advertisement

Next Story

Most Viewed