- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగ యువతకు నైపుణ్యాల అభివృద్ధికై ఉచిత కోచింగ్
దిశ, మహబూబ్ నగర్: గురువారం వర్చువల్ పద్దతిలో నిర్వహించిన మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు. జిల్లాలో వంద శాతం మొక్కలు నాటి గ్రీన్ బెల్ట్ పెంచాలని, అన్ని గ్రామాలలో ఆయా శాఖల అధికారులు నూటికి నూరుశాతం హరితహారం కింద మొక్కలు నాటాలని, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని మంత్రి అన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్ రహదారుల వెంట రోడ్లకు దూరంగా మొక్కలు నాటాలని, లేనట్లయితే రోడ్డు విస్తరణ సమయంలో చెట్లు కొట్టేయాల్సి వస్తుందని అన్నారు. మొక్కల రికార్డును నిర్వహించాలని, గ్రామాలలో ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఇచ్చి నాటించాలని, జిల్లాలో గ్రీన్ బెల్ట్ పెంచాలని, ప్రతి మండల, జిల్లా కార్యాలయంలో మొక్కలు నాటడంతో పాటు నర్సరీలు అభివృద్ధి చేయాలని అన్నారు.
రైతులను డిమాండ్ ఉన్న పంటల వైపు మళ్ళించాలని, పత్తికి డిమాండ్ ఉన్నందున వ్యవసాయ అధికారులు రైతు వేదికలలోనే ఉండాలని, ఉదయమే క్షేత్రస్థాయికి రైతులా వెళ్లాలన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా, గ్రామాలలో విస్తృత చేసి ఎక్కడైనా తాగునీటి పైపులు లీకేజీ లేకుండా, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంతమంది రోగులు వస్తున్నారు? తీవ్రమైన వ్యాధులతో బాధపడే వారి వివరాలను సేకరించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వివరాలు సేకరించాలని, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ద్వారా కూడా వివరాలు ఎప్పటికప్పుడు సేకరించాలని, రోగాల కారణంగా ప్రాణాలు పోవడానికి వీలు లేదని అన్నారు.
కొవిడ్ వల్ల అనాధలైన పిల్లల వివరాలను సేకరించాలని, అలాంటి పిల్లలకు చిన్నప్పటి నుండి బాలికలకు, బాలురకు విడివిడిగా హాస్టల్ వసతి తో పాటు విద్యను అందించి, పెద్దయిన తర్వాత నైపుణ్యాలను అభివృద్ధి చేసి శిక్షణ ఇవ్వాలని మంత్రి అన్నారు. ప్రభుత్వం వివిధ ఉద్యోగాల నియామకాల నిమిత్తం ఇవ్వనున్న నోటిఫికేషన్ లను, జిల్లాలోని నిరుపేద విద్యార్థులకు గ్రూప్స్ కు, అదేవిధంగా కానిస్టేబుల్, ఇతర ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రతి రిక్రూట్ మెంట్ కు ముందగానే కోచింగ్ ఇవ్వాలని సూచించారు.
మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలో చెరువుల కబ్జాలు, ఆక్రమణలు చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు మంత్రి సూచించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ సమన్వయంతో కృషి చేస్తే జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జెడ్పిటిసి లు, ఎంపిపిలు సర్వ సభ్య సమావేశం దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారంలో అధికారులు సహకారం అందించి జిల్లా అభివృద్ధిలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు.