అత్యవ‌స‌ర స‌మ‌యంలో ఉచిత మెడిసిన్

by Anukaran |
Free Medicine2
X

దిశ, తెలంగాణ బ్యూరో: బ‌య‌టికి వెళ్లలేని ప‌రిస్థితి.. క‌రోనా ఎవ‌రి ద్వారా వ‌స్తుందో, ఎలా సోకుతుందో అర్థం కావడం లేదు. ప్రతిరోజు కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో త‌మ ప్రాణాల‌ను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటేనే మంచిది. ప్రాణాలు ద‌క్కాలంటే గ‌డ‌ప దాట‌కుండా ఉండాలి. కాని అత్యవ‌స‌ర‌మైన ప‌రిస్థితుల్లో ఉన్న వృద్ధులు, విక‌లాంగులు, గ‌ర్భిణులకు మందులు ఎవ‌రు తెచ్చివ్వాలి? స‌రియైన స‌మ‌యంలో మందులు వాడ‌కుంటే వారి ప్రాణానికి ప్రమాదం ఏర్పడే అవ‌కాశం ఉంటుంది. అందుకే అలాంటి వారికి మేమున్నామ‌ని, మీకెలాంటి అత్యవ‌స‌రమైన మెడిసిన్ కావాల‌న్నా త‌మ‌ను సంప్రదించాల‌ని చెబుతూ ఎంతోమందికి ఉచిత మెడిసిన్ స‌ర్వీస్ చేస్తూ వారి ప్రాణాల‌ను కాపాడుతోంది యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్షన్ సంస్థ.

మొద‌టి వేవ్ కంటే, సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. క‌రోనా ధాటికి ప్రజలంతా వ‌ణుకుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో నిత్యం మందులు వాడే గ‌ర్భిణీలు, వృద్ధులు బ‌య‌టికి వెళ్లలేని వారికి యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్షన్ సంస్థ సాయం అందిస్తానంటుంది. ఎవ‌రికైనా అత్యవ‌స‌ర మందులు కావాలంటే నేరుగా త‌మ సంస్థను సంప్రదించాల‌ని కోరుతున్నారు. వాట్సాప్ నెంబర్‌కు కావాల‌సిన మందుల వివ‌రాలు పంపిస్తే చాలు.. తాము మీరు ఉన్న ప్రదేశానికి ఉచితంగా మందులు తీసుకొచ్చి ఇస్తామ‌ని సంస్థ ఫౌండ‌ర్ రాజేంద్ర ప‌ల్నాటి అన్నారు.

Free Medicine

గ‌త నెల ప్రారంభమైన ఈ ఉచిత మెడిసిన్ స‌ర్వీస్‌ను రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగిస్తున్నామన్నారు. ఇప్పటికే హైద‌రాబాద్‌తో పాటు ప‌లు జిల్లాల్లో త‌మ వాలంటీర్లు ఉచిత మెడిసిన్ సేవ‌లు నిత్యం అందిస్తున్నార‌న్నారు. క‌రోనా స‌మ‌యంలో ఇలాంటి వారికి సేవ చేయ‌డం త‌మ బాధ్యతని చెప్పారు. ప్రశ్నించ‌డ‌మే కాకుండా అత్యవ‌స‌ర స‌మ‌యంలో ఎదుటి వారి క‌న్నీటిని తుడ‌వ‌డ‌మే త‌మ సంస్థ ముఖ్య ఉద్దేశ్యమంటూ ముందుకు సాగుతున్నారు. మా బృందంలో 24 గంటలు పనిచేయడానికి సభ్యులు ఉన్నారు. కోమటి రమేష్ బాబు, జి.జయరాం, ఇబ్రహీం, కొన్నె దేవేందర్, ప్రవీణ్, స్వప్నారెడ్డి, మారియా అంతోని, ప్రదీప్ రెడ్డి, సతీష్, విజయ్, రియాజ్, సాయినాథ్ రెడ్డి, గంగాధర్, భాస్కర్, సందీప్, శ్రీనివాస్ రావు, తిరుమలేష్ గౌడ్, రాజేశ్ తదితరులు నగరంలో పర్యవేక్షిస్తున్నారు. సంప్రదించాల్సిన నెంబర్లు 8499031234, 7799553385, 9390322191, 9154840115.

Advertisement

Next Story