- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిసెంబర్‌లో రూ. 60 వేల కోట్లకు పైగా ఎఫ్‌పీఐలు!
దిశ, వెబ్‌డెస్క్: గత కొంత కాలంగా భారత్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు(ఎఫ్‌పీఐ) భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌లో ఇప్పటివరకు రూ. 60,094 కోట్లు వచ్చినట్టు డిపాజిటరీస్ గణాంకాలు తెలిపాయి. ఇందులో రూ. 56,643 కోట్లు ఈక్విటీల్లో చేరగా, రూ. 3,451 కోట్లు డెట్ పథకాల్లో మరలినట్టు గణాంకాలు పేర్కొన్నాయి. అంతకుముందు నవంబర్‌లో ఎఫ్‌పీఐలు రూ. 62,951 కోట్లుగా నమోదయ్యాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలే ఎఫ్‌పీఐల పెరుగుదలకు కారణమని, ఈ ఏడాదిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇవి మరింత పెరిగేందుకు దోహదపడిందని నిపుణులు భావిస్తున్నారు.
ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే భారత్ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ఉండటం ఈ పరిణామాలకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయంగా అమలవుతున్న సంస్కరణలు కీలకంగా ఉన్నాయని, డాలరుతో రూపాయి మారకం విలువ స్థిరంగా ఉండటం కూడా కలిసొచ్చిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. భారత్‌కు వచ్చిన ఎఫ్‌పీఐల్లో అత్యధికంగా ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల్లోకి చేరినట్టు ఆయన వెల్లడించారు.