ఏప్రిల్‌లోనూ విదేశీ పెట్టుబడులు వెళ్లిపోయాయి!

by Harish |
ఏప్రిల్‌లోనూ విదేశీ పెట్టుబడులు వెళ్లిపోయాయి!
X

దిశ,వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు మన దేశ మార్కెట్ల నుంచి వెళ్లిపోయాయి. ఏప్రిల్ నెలలోనూ ఈ పరంపర కొనసాగింది. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్(ఎఫ్‌పీఐ) ఏప్రిల్ నెలలో భారత మార్కెట్ల నుంచి రూ. 15,403 కోట్ల నికర మొత్తం ఉపసంహరించుకున్నారు. ఇందులో ఈక్విటీల నుంచి రూ. 6,884 కోట్లు, డెట్ నుంచి రూ. 8,519 కోట్లు వెనక్కి వెళ్లినట్టు డేటాలు చెబుతున్నాయి. మార్చి నెలలో ఈక్విటె, డెట్‌ల నుంచి రికార్డు స్థాయిలో నికర ప్రాతిపదికన రూ. 1.1 లక్షలు కోట్లు తరలిపోయిన సంగతి తెలిసిందే. అధికంగా ఫార్మా, ఎన్‌బీఎఫ్‌సీలే ఇండియాలోకి ఎక్కువగా వస్తున్న ఎఫ్‌పీఐలని నిపుణులు చెబుతున్నారు.

కొవిడ్-19 కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు దేశీయ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతోంది. ఈ క్రమంలోనే గత రెండు నెలలుగా ఔట్ ఫ్లో అధికంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షిత మార్గంలో తమ పెట్టుబడులను యూఎస్ డాలర్లలో దాచుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నికర ఔట్ ఫ్లో ఏర్పిల్‌లోనూ కొనసాగింది. అయితే, మార్చి రికార్డు స్థాయిలో కొనసాగకపోవడం విశేషం. కరోనా దెబ్బకు కొంతకాలంగా మార్కెట్ల సెంటిమెంట్ బలహీనంగా ఉన్నసంగతి తెలిసిందే. ఇది ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags : FPIs, foreign portfolio investors, Indian capital markets, coronavirus impact

Advertisement

Next Story

Most Viewed