- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ఈచ్ వన్.. వ్యాక్సినేట్ వన్’
న్యూఢిల్లీ : కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘టీకా ఉత్సవ్’ ఆదివారం దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమాన్ని ‘కరోనాపై రెండో యుద్ధం’గా ప్రధాని మోడీ అభివర్ణించారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి కొద్దిసేపటి ముందు మోడీ కీలక సందేశం వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకుని, మరొకరికి వేయించాలని సూచించారు. టీకా ఉత్సవ్‌ను విజయవంతం చేయాలని కోరారు.
మోడీ చెప్పిన నాలుగు సూచనలు
1. ఈచ్ వన్ వ్యాక్సినేట్ వన్.. నిరక్షరాస్యులు, వృద్ధులు, వ్యాక్సిన్ వేయించుకోలేని స్థితిలో ఉన్నవారికి సాయం చేయండి.
2. ఈచ్ వన్ ట్రీట్ వన్.. కొవిడ్ చికిత్స తీసుకోవడానికి అర్హత ఉండి వనరులు సరిగా లేని వారికి అండగా నిలవండి.
3. ఈచ్ వన్ సేవ్ వన్.. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, ఇతరులను కూడా పెట్టుకోమని సూచించండి.
4. మైక్రో కంటైన్మెంట్ జోన్లపై దృష్టి సారించండి. మీ ఏరియాలో ఎవరికైనా కరోనా సోకితే అక్కడ మైక్రో కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటుచేయండి. భారత్ వంటి అధిక జనాభా కలిగిన దేశంలో ఇవి ఆశించిన ఫలితాన్నిస్తాయని మోడీ తెలిపారు