హీరోయిన్ పూర్ణకు బెదిరింపులు

by Shyam |
హీరోయిన్ పూర్ణకు బెదిరింపులు
X

డ్యాన్సర్‌గా, మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన పూర్ణ.. 2007లో వచ్చిన ‘‘శ్రీ మహాలక్ష్మీ’’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. పూర్ణ హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తెలుగులో అవును, అవును 2, సీమటపాకాయ్‌, జయమ్ము నిశ్చయమ్మురా, రాజుగారి గది-2 వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె పలు రియాల్టీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం తన స్వస్థలం కేరళలోనే ఉంటోంది. కాగా తాజాగా నలుగురు వ్యక్తులు ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ.. తన తల్లితో కలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్ణకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు ఇవ్వకపోతే… ఆమె కెరీర్ నాశనం చేస్తామని బెదిరించారని, నిందితులు తమ ఇంటి పరిసరాల్లో తిరుగుతూ.. పూర్ణ ఫొటోలు తీస్తున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.

పూర్ణ తల్లి ఇచ్చిన కంప్లయింట్ మేరకు.. కేరళ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితులను త్రిసూర్‌కు చెందిన శరత్‌, అష్రఫ్‌, రఫీక్‌, రమేశ్‌లుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. అరెస్ట్‌ చేసిన నలుగురిని ప్రస్తుతం జ్యూడిషియల్‌ కస్టడీలో ఉంచినట్టు తెలిపారు. ఈ న‌లుగురు గ‌తంలో కూడా ప‌లువురు సెల‌బ్రిటీల‌ని బెదిరించి ఇలానే డ‌బ్బులు డిమాండ్ చేశార‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story