స్నేహితుని వివాహానికి వెళ్లొస్తుండగా.. నలుగురు మృతి

by Anukaran |   ( Updated:2020-12-24 10:37:23.0  )
స్నేహితుని వివాహానికి వెళ్లొస్తుండగా.. నలుగురు మృతి
X

దిశ, భువనగిరి : స్నేహితుని వివాహానికి వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన కారు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటన హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారి భువనగిరి కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం చోటుచేసుకుంది.

వివరాల్లోకివెళితే.. మల్కాజ్ గిరి, ఈసీఐఎల్ ప్రాంతాలకు చెందిన ఆరుగురు యువకులు స్విప్ట్ కారులో ఆలేర్‌లో జరిగిన స్నేహితుడి వివాహానికి హజరై తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కలెక్టర్ కార్యాలయం ఎదుట మొక్కలకు నీళ్లు పోయడానికి ఆగియున్న హెచ్‌ఎండీఏ నీళ్ల ట్యాంకర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేష్, హర్షవర్దన్, కళ్యాణ్, అఖిల్‌లు అక్కడికక్కడే మృతి చెందగా.. కార్తీక్, రవిలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్దలికి చేరుకున్న రాచకొండ పోలీసులు, హైవే పెట్రోలింగ్ పోలీసులు గాయపడ్డ వారిని హైద్రాబాద్ తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed