- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నలుగురు మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్టు
దిశ, భద్రాచలం: చర్ల పోలీసులు నలుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను అరెస్టు చేశారు. ఈ అరెస్టుకి సంబంధించి భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల పోలీసులు, సీఆర్‌పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా మంగళవారం ఉదయం చర్ల మండల పరిధిలోని కొరకట్‌పాడు – వీరాపురం గ్రామాల నడుమ అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఇదే సమయంలో పోలీసులకు ఎదురుపడ్డ కొందరు వ్యక్తులు పారిపోతుండగా వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారు మడకం ఉంగయ్య, కుంజం అడమయ్య, రవ్వ మంగయ్య, మూసకి ఇంగాలు మావోయిస్టు మిలీషియా సభ్యులని తేలింది. మరికొంతమంది మిలీషియా సభ్యులతో కలిసి కమాండర్ బాలు (వెట్టి దేవా) నాయకత్వంలో పనిచేస్తున్నారని తేలింది. ఈ క్రమంలోనే చర్ల పోలీస్ లిమిట్స్‌లో గతంలో జరిగిన పలు విధ్వంసకర సంఘటనల్లో నిందితులుగా కూడా ఉన్నట్టు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలోనే మిలిషీయా సభ్యులను కోర్టులో హాజరుపరిచినట్టు ఏఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో చర్ల సీఐ బి. అశోక్, సీఆర్‌పిఎఫ్ 141 బెటాలియన్ కమాండెంట్ శ్రీ హరి ఓం ఖరే, చర్ల ఎస్ఐ టి. వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.