కృష్ణాజిల్లాలో దారుణం.. నాలుగు రోజుల బాలుడు మృతి

by srinivas |
కృష్ణాజిల్లాలో దారుణం.. నాలుగు రోజుల బాలుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణాజిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్యం వికటించి నాలుగు రోజుల బాలుడు మృతిచెందాడు.. ఘటన జిల్లాలోని బాపులపాడు మండలం హనుమాన్ జుంక్షన్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం చోటుచేసుకుంది.

బాలుడు మృతితో ఆస్పత్రి వద్ద తల్లిదండ్రులు బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందాడని వారు ఆరోపిస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించిన ఆస్పత్రి సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story