కర్ణాటక సత్రాల నిర్మాణానికి శంకుస్థాపన..!

by Anukaran |
కర్ణాటక సత్రాల నిర్మాణానికి శంకుస్థాపన..!
X

దిశ, వెబ్‎డెస్క్: తిరుమలలో కర్ణాటక సత్రాల నూతన సముదాయ నిర్మాణానికి ఆ రాష్ట్ర సీఎం యడియూరప్ప, ఏపీ సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అధునాతన కర్ణాటక సత్రం రూ.200 కోట్లతో నిర్మిస్తున్నారు. ఏడు ఎకరాల్లో ఐదు కాంప్లెక్సుల నిర్మాణం జరగనుంది. ఈ సత్రంలో రోజుకు 1,800 మంది భక్తులకు వసతి కల్పించేలా నిర్మించనున్నారు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం టీటీడీకి ఇచ్చిన రూ.200 కోట్ల నిధులతో భవనాలను నిర్మించనుంది.

అంతకు ముందు తిరుమల శ్రీవారిని ఇరు రాష్ట్రాల సీఎంలు దర్శించుకున్నారు. అనంతరం సుందరకాండ పారాయణం నిర్వహిస్తోన్న కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Next Story