- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే, ఎంపీల కేసులను త్వరగా విచారించాలి !
దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్యేలు, ఎంపీలపై నమోదైన కేసుల్లో జాప్యం జరగకుండా త్వరగా విచారించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరింది. అందుకు కావాల్సిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్‌ను కోరుతూ శుక్రవారం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో లేఖ రాశారు. చట్టసభల సభ్యులపై ఉన్న కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారించాలని సుప్రీంకోర్టు సూచించిన విషయాన్ని అందులో గుర్తు చేశారు. ఈ సందర్భంగా పద్మానాభ రెడ్డి మాట్లాడుతూ రాష్ర్టంలోని పోలీసులపై అధికార పార్టీ నేతల పెత్తనం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరిపై ప్రభుత్వమే కేసులను విత్ డ్రా చేసుకోవడంపై పద్మనాభరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 17మంది ఎంపీల్లో 10మందిపై, 119 ఎమ్మెల్యేల్లో 67 మందిపై కేసులు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో కేసుల విచారణకు సంబంధించి తక్షణమే ప్రభుత్వ ప్లీడరు నియామకం చేపట్టడంతో పాటు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.