చంచల్‌గూడ జైలుకు ఇందిరాశోభన్.. ఎందుకో తెలుసా?

by Shyam |
Indira Shobhan, Teenmar Mallanna
X

దిశ, తెలంగాణ బ్యూరో: క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నతో ములాఖత్ అయ్యేందుకు సీనియర్ నాయకురాలు ఇందిరాశోభన్ గురువారం చంచల్ గూడ జైలుకు వెళ్లారు. ఆయనను కలిసేందుకు జైలు సిబ్బందికి దరఖాస్తు చేసినట్లు ఇందిరాశోభన్ ఒక ప్రకటనలో చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మల్లన్నను కలిసేందుకు పోలీసులు తిరస్కరించారని వెల్లడించారు. అయితే, వీడియో కాల్ ద్వారా ములాఖత్‌కు అనుమతి ఇస్తామని చెప్పారని, కానీ, ఎప్పుడు వీడియో కాల్‌కు అనుమతి లభిస్తుందో అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదని ఆమె తెలిపారు.

అదికూడా రోజుకు కేవలం ఒకరికి మాత్రమే వీడియో కాల్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు చెప్పారని ఆమె పేర్కొన్నారు. కొవిడ్ పేరుతో ములాఖత్ అనుమతికి నిరాకరిస్తూ నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ నిబంధనలకు సడలింపు ఇచ్చినా, తెలంగాణ సర్కార్ జైలు ములాఖత్ విషయంలో ఎందుకు ఆంక్షలు పెడుతుందో తెలియడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ప్రత్యక్ష ములాఖత్‌కు అనుమతించే విషయంపై జైలు అధికారులు తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed