ఉపాధి కోల్పోయి.. రోడ్డున పడ్డ చేనేతలు

by Shyam |
ఉపాధి కోల్పోయి.. రోడ్డున పడ్డ చేనేతలు
X

దిశ, మునుగోడు: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ప్రతి గ్రామంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం యాదాద్రి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని కొయ్యలగూడెం గ్రామంలోని పద్మజ్యోతి యువజన సంఘం ఆవరణలో దీక్షా శిబిరాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని చేనేత కార్మికులు అందరూ కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో నిల్వ ఉన్న చేనేత వస్త్రాల కొనుగోలు లేక ఉపాధిని కోల్పోయి వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఒక్కో కుటుంబానికి నెలకు రూ.8 వేలను జీవనభృతిగా చెల్లించాలని, నిల్వ ఉన్న చేనేత వస్త్రాలు అన్నింటినీ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సహజ మరణం చెందిన ప్రతి చేనేత కార్మికునికి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, నూలు, రంగులపై 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed