- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్కు చర్లపల్లి జైలే గతి : పొన్నాల
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, త్వరలో సీఎం కేసీఆర్కు చర్లపల్లి జైలే గతి అవుతుందని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. శనివారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో సీఎం దుబ్బాకకు వెళ్లకుండా కొడకండ్లకు వెళ్లి మాట్లాడారన్నారు. హైదరాబాద్కు ప్రధాని వచ్చినా సీఎంకు ఆహ్వానం లేకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించినట్టేనన్నారు. టీఆర్ఎస్ బహిరంగ సభ జనం లేక వెలవెలబోయిందని, టీఆర్ఎస్ వెంట జనం లేరన్నారు. వరద బాధితుల గురించి మాట్లాడుతున్నారని, తెలంగాణ వ్యాప్తంగా ఎందుకు నష్టపరిహారం ఇవ్వలేదని పొన్నాల ప్రశ్నించారు.
హైదరాబాద్లో కాల్వలు, రోడ్లకు ఏటా రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని, ఇంతకాలం ఎందుకు చేయలేదని, గత గ్రేటర్ ఎన్నికల్లో చెప్పిన లక్ష ఇండ్ల సంగతి ఎందుకు మాట్లాడటం లేదని, వంద రోజుల ప్రణాళిక ఏమైందన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ హైదరాబాద్ వరదల గురించి మాట్లాడారని, అధికారంలోకి వచ్చిన ఆరేండ్లలో ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిజస్వరూపం బయటపడిందని, అవినీతిలో కూరుకుపోయారన్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్కు రావడం రాజకీయ ఉద్ధేశ్యమేనని, ఏడె కంపెనీలు కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తుంటే మూడు కంపెనీలు మాత్రమే ఎందుకు పరీక్షించారని బీజేపీ పార్టీ అగ్ర నాయకులంతా హైదరాబాద్లో ఉంటే మేడీ రావడం ఎన్నికల కుతంత్రమేనని పొన్నాల ఆరోపించారు.