పాక్ మాజీ బౌలర్‌కు షాక్.. ఐపీఎల్‌ను కించపరిచాడని ఫ్యాన్స్ రచ్చ

by Shyam |
పాక్ మాజీ బౌలర్‌కు షాక్.. ఐపీఎల్‌ను కించపరిచాడని ఫ్యాన్స్ రచ్చ
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్‌ రంగంలో రిచ్ ప్రీమియర్‌ లీగ్‌‌గా పేరొందిన ఐపీఎల్‌పై పాకిస్తాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావేద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌లో లో క్వాలిటీ బౌలింగ్‌ ఉంటుందని.. అందుకే ఒకే రకమైన క్రికెట్‌ ఉంటుందంటూ.. అసలైన క్రికెట్ అంటే PSL(పాకిస్తాన్ సూపర్ లీగ్) అంటూ తన ట్విట్టర్‌లో చెప్పుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన లీగ్ పీఎస్‌ఎల్ అంటూ కొనియాడుతూనే ఐపీఎల్‌ను తక్కువ చేసి మాట్లాడాడు. ఇక ఈ వ్యవహారంపై ఐపీఎల్ ఫ్యాన్స్ విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. పీఎస్ఎల్ పిచ్‌లు చిన్నగా ఉంటాయని.. ఐపీఎల్‌‌ను అతి పెద్ద స్టేడియాల్లో నిర్వహిస్తారని.. ఆ మాత్రం తెలియదా అంటూ ఫైర్ అవుతున్నారు. మరో వైపు ఆకిబ్ జావేద్‌కు పలువురు మద్దతు ఇస్తూ.. కేవలం డబ్బు కోసమే ఐపీఎల్ ఆడుతున్నారని పలువురు నెటిజన్లు రిప్లై ఇవ్వడం గమనార్హం.

Advertisement

Next Story