అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవాలి.. ఆఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు

by Shyam |
Shahid Afridi, Virat Kohli
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షహీద్ ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవడంపై ఆఫ్రిది స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకొని, బ్యాటింగ్‌పై పూర్తి దృష్టి పెట్టడమే కోహ్లీకి, టీమిండియాకు మంచిదని సూచించారు. కాగా, ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ అనంతరం నుంచి టీ20 కెప్టెన్ బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకోవడంతో, ఆ బాధ్యతలు భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మకు అప్పగించారు.

Advertisement

Next Story