ముంబై మాజీ పేసర్ రంజిత మృతి

by Shyam |
ముంబై మాజీ పేసర్ రంజిత మృతి
X

దిశ, స్పోర్ట్స్: ముంబై జట్టు మాజీ రంజీ ప్లేయర్ రంజిత రాణే క్యాన్సర్‌తో పోరాడుతూ బుధవారం చనిపోయారు. ముంబై జట్టుకు పలు రంజీ మ్యాచ్‌లలో కీలక పేసర్‌గా వికెట్లు తీసిన రంజిత క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక స్కోరర్‌గా కెరీర్ కొనసాగిస్తున్నారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న రంజిత చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. 15 రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన రంజితను ముంబైలోని ఒక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే బుధవారం పరిస్థితి విషమించి మరణించినట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ‘రంజిత మృతి తీవ్రంగా కలచి వేసింది. క్రికెటర్, స్కోరర్‌గా ఆమె ముంబై జట్టుకు ఎంతో సేవ చేశారు. ఆమె మృతి మాకు తీరని లోటు’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 1995 నుంచి 2003 మధ్యలో 44 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన రంజిత బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు.

Advertisement

Next Story