- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ నరరూప రాక్షసుడు.. మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ ఆగ్రహం
దిశ, జమ్మికుంట: మనుషులను నరికి చంపుతున్నా.. చలించని నరరూప రాక్షసుడు కేసీఆర్ అని, పెద్దపల్లి జిల్లాలో నడిరోడ్డుపై అడ్వకేట్‌లను నరికి చంపుతుంటే దిక్కులేదని, మానవత్వం లేని మృగం కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం హుజూరాబాద్ పట్టణంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఎంపీపీ భర్త సురేందర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని, టీఆర్ఎస్ పార్టీ కాని వారికి ‘దళితబంధు’ రాదు అనడం ఏంటని, సురేందర్ రెడ్డి మా దళిత జాతిని అవమానపరిచాడని మండిపడ్డారు. సురేందర్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘దళితబంధు’ ఈటల రాజేందర్ దయవల్ల వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే హుజరాబాద్‌లో 3 వేలమంది పోలీసులు దిగారని, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కండువా కప్పుకోని కల్వకుంట్ల కుటుంబ సభ్యులుగా పని చేస్తున్నారని ఆరోపించారు. ఎవరేం చేసినా ఇక్కడ గెలిచేది ఈటల రాజేందర్ అని జోస్యం చెప్పారు.
హుజూరాబాద్‌లో తాలిబన్‌ల పాలన నడుస్తుందా? ఇంతమంది పోలీసులను ఎందుకు దింపుతున్నారని ప్రశ్నించారు. హుజూరాబాద్ ప్రజల ప్రేమ ఈటల మీద ఉన్నది కాబట్టే కేసీఆర్‌కు వెన్నులో వణుకు పుట్టిందని అన్నారు. కొండగట్టు బస్సు ఆక్సిడెంట్ జరిగి 67 మంది చనిపోతే రాని ముఖ్యమంత్రి, ఈరోజు హుజూరాబాద్ ఎన్నిక కోసం కరీంనగర్ వచ్చి రివ్యూ పెట్టుకున్నాడని, ఇక్కడే బీజేపీ గెలిచిందని అన్నారు. హుజూరాబాద్‌లో ఈటల గెలవాలని అప్పుడే ప్రజాస్వామ్య బతికినట్లు అని, హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అందరికీ ‘దళితబంధు’ అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిగలత, ఎస్‌సీఎఫ్ అధ్యక్షుడు మేడి రమణ, దళిత నాయకులు యాదయ్య, కుమార్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.