జీవో 217ని రద్దు చేయాలి : కొల్లు రవీంద్ర

by Anukaran |   ( Updated:2021-09-01 07:22:26.0  )
kollu
X

దిశ, ఏపీ బ్యూరో: జగన్ సర్కార్‌పై మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకార సొసైటీ హక్కులను కాలరాసేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్ తీసుకువచ్చిన జీవో 217 మత్స్యకారుల పొట్ట కొట్టే విధంగా ఉందని ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ బుధవారం జీవో 217 ప్రతులను దహనం చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ మత్స్యకారులను నిలువునా నీటిలో ముంచుతున్నారని మండిపడ్డారు.

చెరువులకు ఆన్‌లైన్‌లో టెండర్ ప్రక్రియ అంటూ మత్స్యకారుల గొంతు కోస్తున్నారని విరుచుకుపడ్డారు. మంత్రి సీదిరి అప్పలరాజు తన పదవిని కాపాడుకోవడం కోసం మత్స్యకారులకు అన్యాయం జరుగుతున్నా చూస్తూ కూర్చున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం జీవో 217ని రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని మాజీమంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed