ఈటల రాజీనామా అప్పుడే..

by Anukaran |   ( Updated:2021-06-02 02:07:58.0  )
ఈటల రాజీనామా అప్పుడే..
X

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నాడని తెలియగానే హుజురాబాద్ బై ఎలక్షన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, మంత్రి పదవి నుంచి ఈటలను బర్తరఫ్ చేసిన విధంగానే తెలంగాణ ప్రభుత్వం ఆయన శానన సభ్యత్వంపై కూడా అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు సూచిస్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. అసైన్డ్ భూములను అక్రమంగా కొన్నారనే వ్యవహారంలో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటలను గులాబీ పార్టీకి దూరం చేయడంతో పాటు నియోజక వర్గ లీడర్లను సైతం కారు పార్టీ వెంటే ఉండేలా చక్రం తిప్పుతూ వచ్చారు. ఈ పరిస్థితులను నిశితంగా గమనించిన ఈటల..

ఇంకా ఆలస్యం చేస్తే తన కేడర్ ఎక్కడ దూరం అవుతుందోనని భావించి డేర్ స్టెప్ వేసినట్లు తెలుస్తోంది. ముందుగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చర్చలు జరిపిన ఆయన కాషాయ కండువా కప్పుకునే ముహుర్తాని కంటే ముందే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఈటల న్యాయ సలహాలు సైతం తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు. ఈరోజు రాత్రి బీజేపీలో చేరే విషయంపై ఫైనల్ డెసిషన్ తీసుకుని వచ్చేవారం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. అప్పుడే ఢిల్లీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీని ప్రకారం మరో వారంలో ఈటల తన శాసనసభ సభ్వత్వానికి రాజీనామా చేయనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed