- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈపీఎల్‌లో ఈ హీరోలు గుర్తున్నారా?
దిశ, స్పోర్ట్స్ : రెండు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (EPL) ఎంతో మంది ఫుట్‌బాల్ క్రీడాకారులను ప్రపంచానికి పరిచయం చేసింది. తమ అద్భుతమైన టాలెంట్‌తో జట్లను గెలిపించడమే కాకుండా కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్నారు. ప్రీమియర్ లీగ్ అనగానే క్రిస్టియానో రొనాల్డో, థిరీ హెన్రీ, లూయిస్ సారెజ్ వంటి నేటి తరం క్రీడాకారులు మాత్రమే గుర్తొస్తుంటారు. కానీ గత 27 ఏళ్లలో ఎంతో మంది ఆటగాళ్లు అద్భుతమైన ఆటను ఆడారు. కానీ ఫుట్‌బాల్ ప్రపంచంలో మాత్రం వారికి తగిన గుర్తింపు రాలేదు. వాళ్లలో కొంత మంది గురించి మనం తెలుసుకుందాం.
ముస్తఫా హడ్జి
మొరాకోకు చెందిన ముస్తఫా హడ్జి 1998లో ఆఫ్రికన్ ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. మొరాకో తరపున వరల్డ్ కప్ ఆడిన హడ్జి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరుసటి ఏడాదే ప్రీమియర్ లీగ్‌లో జాయిన్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా ఈపీఎల్‌లో అడుగు పెట్టాడు. న్యూకాజిల్ యునైటెడ్, ఆస్టన్ విల్లా, ఆర్సెనల్ క్లబ్స్ తరపున 33 మ్యాచ్‌లు ఆడాడు. 2003లో తన ఈపీఎల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు
బ్రయన్ రాయ్
నెదర్లాండ్స్‌కు చెందిన బ్రయన్ రాయ్ 1994 వరల్డ్ కప్‌లో ఆడాడు. అతడి ప్రదర్శన చూసిన నాటింగ్‌హామ్ ఫారెస్ట్ క్లబ్ జట్టులోకి తీసుకుంది. తొలి సీజన్‌లోనే 13 గోల్స్ చేశాడు. మొత్తం 84 ప్రీమియర్ లీగ్ గేమ్స్ ఆడిన రాయ్ 1997లో ఆటకు గుడ్‌బై చెప్పాడు.
డీన్ ఆస్టన్
ఫుట్‌బాల్ ఆటలో బెస్ట్ ఇంగ్లీష్ స్ట్రైకర్ ఎవరంటే ఎవరైనా డీన్ ఆస్టన్ పేరే చెబుతారు. 2000 తర్వాత ఫుట్‌బాల్ సర్కిల్స్‌లో ఆస్టన్ పేరు మార్మోగింది. క్రూవ్ అలెగ్జాండ్రా క్లబ్ తరపున ఆడిన ఆస్టన్ తన గాయాల కారణంగా కెరీర్‌ను కొనసాగించలేక పోయాడు. 177 మ్యాచ్‌లో 74 గోల్స్ చేసిన రికార్డు అతడి పేరు మీద ఉన్నది. హామ్మర్స్ ఎఫ్‌సీని 2006లో ఎఫ్ఏ కప్ ఫైనల్స్‌కు తీసుకొని వెళ్లడంతో ఆస్టన్‌దే కీలక పాత్ర. 26 ఏళ్ల వయసులోనే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
మిచ్చు
ఫుట్‌బాల్ ప్లేయర్ మిచ్చును ‘వన్ సీజన్ వండర్’ అని పిలుస్తుంటారు. స్వాన్‌సీ సిటీ తరపున ఈపీఎల్ ఆడిన మిచ్చు 2013లో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. లా లిగాలో కూడా 15 గోల్స్ చేసిన రికార్డు ఉంది. అయితే 2013 తర్వాత ఏ సీజన్‌లో కూడా మిచ్చు ఆకట్టుకోలేక పోయాడు. అందుకే అతడిని వన్ సీజన్ వండర్ అని పిలుస్తుంటారు.
రాబ్ లీ
ప్రీమియర్ లీగ్‌లో 280 మ్యాచ్‌లు ఆడిన చరిత్ర రాబ్ లీ పేరుతో ఉంది. మంచి టాలెంటెడ్ ప్లేయరే అయినా అన్ని మ్యాచుల్లో చేసింది 34 గోల్స్ మాత్రమే. అయితే వీటిలో ఎన్నో గోల్స్ న్యూకాజిల్ యునైటెడ్ క్లబ్ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. న్యూ కాజిల్ యునైటెడ్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
జార్గి కింక్లాజ్
ప్రపంచంలో అత్యంత ధనిక ఫుట్‌బాల్ క్లబ్ అయిన మాంచెస్టర్ సిటీ తరపున జార్గి కింక్లాజ్ ఆడాడు. ఎన్నో ఏండ్ల పాటు ప్రీమియర్ లీగ్‌లో ఓటములు ఎదుర్కున్న మాంచెస్టర్ సిటీని గెలుపు పట్టాలు ఎక్కించింది జార్గి. 37 ప్రీమియర్ లీగ్ గేమ్స్ ఆడిన జార్గి మాంచెస్టర్‌ను వదిలి వెళ్లాక తిరిగి ఈపీఎల్ ఆడలేదు.