భారత్‌లో మూతబడనున్న మరో కంపెనీ.. ఎందుకంటే ?

by Harish |   ( Updated:2021-09-09 07:17:37.0  )
ford
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్స్ భారత్‌లో తన తయారీ కార్యకలాపాలను మూసివేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భారత్‌లో సంస్థకున్న రెండు ఉత్పత్తి ప్లాంట్లను మూసేయాలని, భవిష్యత్తులో భారత ఆటో మార్కెట్లో తన కార్లను దిగుమతి చేసుకుని విక్రయించాలని భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్ కంపెనీకి భారత్‌లోని తమిళనాడు, చెన్నైలోనూ, గుజరాత్‌లలో ప్లాంట్ల ద్వారా కార్యకలాపాలను నిర్వహిస్తొంది. ఇక్కడి నుంచి ఫోర్డ్ ఎకోస్పోర్ట్, ఫిగో, యాస్పైర్ మోడళ్లను ఉత్పత్తి చేస్తున్నారు.

అయితే, సంస్థలు దాదాపు రూ. 15 వేల కోట్ల నష్టాలను ఎదుర్కొనడమే కాకుండా, వాహనాల అమ్మకాలు కూడా తగ్గిపోతున్న కారణంగా భారత్‌లో తయారీని నిలిపేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కార్యకలాపాల తగ్గింపు ప్రణాళికలో భాగంగా దేశీయంగా ఈ సంస్థలో 4,000 మంది ఉద్యోగులపై ప్రభావం పడింది. దీంతో లాభదాయకం కానందునే ఫోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, సంస్థ నుంచి మూసివేతకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలెేదు. మూసివేత ఖరారైతే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో ఏడాది పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఇప్పటికే భారత మార్కెట్ నుంచి జనరల్ మోటార్స్, హార్లే-డెవిడ్‌సన్ లాంటి అంతర్జాతీయ కంపెనీలు లాభదాయకంగా లేని కారణంతో వెళ్లిపోయాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి ఫోర్డ్ కూడా వచ్చి చేరింది.

Advertisement

Next Story

Most Viewed