Children's Covid Centre: రాష్ట్రంలోనే తొలిసారిగా.. చిల్డ్రన్స్ కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం

by vinod kumar |   ( Updated:2021-05-26 03:22:42.0  )
Childrens Covid Centre: రాష్ట్రంలోనే తొలిసారిగా.. చిల్డ్రన్స్ కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. 3వ దశ చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోనే చిల్డ్రన్స్ కొవిడ్ సెంటర్ ను ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని మాతా శిశు కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కాగా ఈ చిల్డ్రన్స్ కొవిడ్ కేర్ సెంటర్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. కలెక్టర్ కర్ణన్ తో కలిసి నేడు మధ్యాహ్నం 03.00 గంటలకు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోనే తొలి చిల్డ్రన్స్ కొవిడ్ కేర్ సెంటర్ గా మాతా శిశు కేంద్రం నిలుస్తుందని వైద్యులు తెలుపుతున్నారు.

Advertisement

Next Story