ఫుట్‌బాల్ దిగ్గజం పాలోరోజీ కన్నుమూత

by Anukaran |   ( Updated:2020-12-10 11:03:39.0  )
ఫుట్‌బాల్ దిగ్గజం పాలోరోజీ కన్నుమూత
X

దిశ, స్పోర్ట్స్ : ఇటలీ ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు పాలోరోజీ (64) గురువారం కన్నుమూశారు. అతడి మరణవార్తను ఆయన పనిచేస్తున్న ఆర్ఏఐ స్పోర్ట్స్ న్యూస్ సంస్థ ఒక ట్వీట్‌లో పేర్కొన్నది. ఆ తర్వాత కాసేపటికే ఆయన భార్య ఇన్‌స్టాగ్రమ్‌లో అతడితో దిగిన ఫొటోను పోస్ట్ చేసి ‘ఫర్ ఎవర్’ అనే క్యాప్షన్ జోడించింది. ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మరడోనా మరణించిన కొద్ది రోజులకే మరో ఆటగాడు చనిపోవడంతో ఫుట్‌బాల్ అభిమానులు కలత చెందుతున్నారు.

1982లో స్పెయిన్‌లో జరిగిన సాకర్ ప్రపంచ కప్‌లో ఆరు గోల్స్ చేసి అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆ ఏడాది ఇటలీ జట్టు ప్రపంచ కప్ గెలవడంతో పాలోరోజీదే కీలక పాత్ర. ఇక క్లబ్ లీగ్స్‌లో జువాంటస్ తరపున నాలుగేళ్లు ఆడి రెండు ఇటాలియన్ సిరీస్-ఏ టైటిల్స్ సాధించాడు. అంతే కాకుండా ఆ క్లబ్‌కు యూరోపియన్ కప్‌కూడా అందించాడు. కాగా, పాలోరోజీ స్పాట్ ఫిక్సింగ్‌లో ఇరుక్కొని రెండేళ్ల పాటు ఆటకు దూరమయ్యాడు. తమ అభిమాన ఆటగాడు ఇలా చేయడంపై అనేక మంది ఫ్యాన్స్ అతడికి దూరమయ్యారు.

Advertisement

Next Story