ఉస్మానియా వైద్య విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

by Shyam |
ఉస్మానియా వైద్య విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదువుతున్న 20 మంది వైద్య విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో ప్రస్తుతం వారు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు మీడియాకు తెలిపారు. ప్రస్తుతం వారిని అబ్జర్వేషన్‌లో ఉంచామని వెల్లడించారు. ప్రతిరోజు మాదిరిగానే మధ్యాహ్నం భోజనం చేశారని, కానీ కొన్ని గంటల తర్వాత వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయని తెలిపారు. తొలుత 17 మంది గాంధీ ఆస్పత్రికి వచ్చారని, ఆ తర్వాత మరో ముగ్గురు వచ్చారని డాక్టర్ రాజారావు వెల్లడించారు. ఏ రకమైన ఫుడ్ పాయిజన్ అనే విషయాన్ని పరిశీలించిన తర్వాత నిర్ధారణ అవుతుందని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed