జుట్టు నెరవకుండా ఉండాలంటే..!

by sudharani |
జుట్టు నెరవకుండా ఉండాలంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, పోషకాహార లోపం వలన చిన్న వయస్సులోనే చాలామందికి జుట్టు నెరుస్తోంది. దీంతో యుక్త వయస్సు వచ్చే సరికి యువకులు తెల్లజుట్టుతో వయస్సు మీరిన వారిగా కనిపిస్తున్నారు. అలా కనిపించకుండా ఉండేందుకు చాలామంది నల్లరంగు వేసుకుని కవర్ చేస్తున్నారు. అందకు కారణం తినే తిండిలో పోషకాహార లోపం, కెమికల్స్‌తో కూడిని షాంపులు వాడటం వల్లే అని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పదేండ్ల నుంచి పదిహేనేండ్ల వయస్సు ఉన్న విద్యార్థినీ, విద్యార్థులకు జుట్టు నెరవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

జుట్టు ఎందుకు నెరుస్తుంది..

చిన్న వయస్సులోనే జుట్టు నెరవడానికి నిపుణులు పలు కారణాలను వెల్లడించారు. తినే తిండిలో పోషకాలు లేకపోవడం, బియ్యాన్ని వంటకు ముందు ఎక్కువగా వాష్ చేయడం, గంజి వంచడం వలన అందులోని థయామిన్ అనే విటమిన్ బయటకు వెళ్లిపోతుంది. అలాగే ఎక్కువగా ఆలోచించడం, మెదడుకు రక్తప్రసరణ సరిగా జరగకపోవడం, కెమికల్స్‌తో కూడిన షాంపులు వాడటం, రెగ్యూలర్‌గా కొబ్బరి నూనెతో మర్దన చేసుకోకపోవడం, పొల్యూషన్ వలన జుట్టు రాలడం, చిట్లడం లేదా నెరవడం జరుగుతుందని తెలిపారు.

ముందు జాగ్రత్తలు..

తెల్లజుట్టు వస్తున్నట్లు కొంచెం అనుమానం వచ్చినా ఈ చిట్కాలు పాటిస్తే ఆదిలోనే దానిని నివారించవచ్చు. ముందుగా కొన్ని బంగాళ దుంపలు తీసుకుని పొట్టు తీయాలి. ఆ పొట్టును ఒక చిన్న పాత్రలో వేసి కాసిన్ని నీళ్లు పోసి చిన్న మంటపై ఉడికించాలి. పది నిమిషాల తరువాత మరో పాత్రలోకి వాటిని వడపోసుకోవాలి. అందులో రెండు, మూడు చుక్కల శాండల్‌వుడ్‌ ఆయిల్‌ను వేయాలి. తల స్నానం చేశాక ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. వారంలో రెండు, మూడు రోజులు ఇలా చేస్తే తెల్లజుట్టు సమస్యను నివారిచవచ్చు.

మరో విధంగా చూస్తే.. మందార పువ్వులు, కరివేపాకును ఎండకు ఎండబెట్టాలి. వాటిలోని తేమ శాతం పోయాక ఓ గిన్నెలో కొబ్బరినూనె పోసి అందులో ఎండిన మందార, కరివేపాకులతో పాటు రెండు ఉల్లిగడ్డలు తురిమినవి వేసి సన్నని మంట మీద మరిగించాలి. నూనె మొత్తం బ్రౌన్ కలర్‌లోకి మారక జార్‌లో వడపోసుకోవాలి. తలస్నానం చేశాక శుభ్రంగా జుట్టు తుడుచుకుని రెండ్రోజుల కొకసారి తలకు ఈ ఆయిల్ కుదుళ్లకు పట్టేలా అప్లయ్ చేసుకుంటే.. జుట్టు ఒత్తుగా, నల్లగా ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed