- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికా పర్యటనకు ఆర్థిక మంత్రి నిర్మలా
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వారం రోజుల సుధీర్ఘ పర్యటన కోసం అమెరికాకు వెళ్లనున్నారు. అక్కడ జరగబోయే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వార్షిక సమావేశంతో పాటు జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల(ఎఫ్‌సీబీజీ) సమావేశంలో పాల్గొంటారు. అక్టోబర్ 11వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఆర్థిక మంత్రి పర్యటన ఉండనుంది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాలు కొవిడ్ మహమ్మారి తర్వాత భౌతికంగా జరగడం ఇదే మొదటిసారి. అయితే, ఈ సమావేశాలను వర్చువల్ విధానంలో కూడా జరిపే వెసులుబాటు ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
యూఎస్ అధికారిక పర్యటనలో భాగంగా, నిర్మలా సీతారామన్ పెట్టుబడిదారులు, ప్రైవేట్ ఈక్విటీ మదుపరులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారత వృద్ధికి దోహదపడేలా పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని కోరనున్నారు. అలాగే, అమెరికా ట్రెజరీ సెక్రటరీ జెనెట్ యెలెన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక, అక్టోబర్ 13న జరగబోయే ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల(ఎఫ్‌సీబీజీ) సమావేశానికి నిర్మలా సీతారామన్ హాజరవుతారు. అంతర్జాతీయ పన్ను ఒప్పందానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చ ఉండనుంది. ఇందులో భారత డిజిటల్ సేవల పన్ను ఉపసంహరించుకోవచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి పన్ను అమలవకుండా నిర్ణయం తీసుకోవాల్సి ఉండొచ్చు.