- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాణం పోయింది.. గ్రేటర్‌లో విషాదం నింపిన వరదలు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో గురువారం కురిసిన భారీ వర్షం, వరదలు ఓ వృద్ధురాలి ప్రాణాలను బలితీసుకున్నాయి. ఈ ఘటన సరూర్‌నగర్‌లోని కోదండరాంనగర్‌లో వెలుగుచూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే..
నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షం ఎఫెక్టుతో సరూర్‌నగర్‌లోని పలు కాలనీల్లో వరద నీరు వచ్చి చేరింది. కోదండరాంనగర్ పూర్తిగా జలమయం అయింది. రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే ఏరియాలో నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలు ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయన్న ఆందోళనతో ఒక్కసారిగా గుండెపోటుకు గురైంది. వెంటనే అప్రమత్తమైన కుటుంబీకులు అంబులెన్స్‌కు కాల్ చేశారు. కానీ, వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వీధి చివరిలోనే అంబులెన్స్ ఆగిపోయింది. దీంతో స్ట్రెచర్ సాయంతో అంబులెన్స్‌లోకి ఎక్కించినప్పటికీ.. వరద ప్రవాహానికి వాహనం ముందుకు కదల్లేకపోయింది. దీంతో సమయానికి వైద్యం అందక పేషెంట్ చనిపోయిందని కుటుంబీకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
గత 30 ఏండ్లుగా నరకం చూస్తున్నాం..
ప్రతీ ఏడాది వరదలతో అనేక ఇబ్బందులు పడుతున్నా.. స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని కుటుంబీకులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కురిసిన మరుసటి రోజు కూడా కాలనీల్లో వరదలు కొనసాగుతున్నాయని.. కనీసం ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యంగా సరూర్‌నగర్ కట్ట కింద(లోతట్టు) ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు.. గత 30 ఏండ్లుగా నరకం చూస్తున్నామని వాపోతున్నారు. చెరువు నిండి.. పొంగిపొర్లడంతో అందులో నుంచి పాములు ఇండ్లల్లోకి వస్తున్నాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు సరూర్‌నగర్ చెరువులో మొసలి కూడా ఉందని.. జనావాసాల్లోకి వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.