- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సాయం కోసం.. ముంపు బాధితుల ఆగ్రహం
దిశ, ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు బస్తీల ముంపు బాధితులు తమకు వరద సహాయం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగారు. ప్రభుత్వం ముంపు బాధితులకు అందిస్తున్న నగదు సహాయాన్ని టీఆర్ఎస్ నాయకులు తమకు అనుకూలమైన వారికి ఇప్పిస్తూ నిజమైన బాధితులకు దక్కకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా నియోజకవర్గ ఎమ్మెల్యే, కార్పొరేటర్లు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని, వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. నిరసన వ్యక్తం చేశారు.
నియోజకవర్గం పరిధిలోని కవాడిగూడ, ముషీరాబాద్, గాంధీనగర్ డివిజన్లలో ప్రజలు ఆదివారం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. కవాడిగూడ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు మహేందర్ బాబు ఆధ్వర్యంలో ముంపు బాధితులు, పలు బస్తీలలో వాసులు రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ ముషీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ రమేష్ రామ్ పాల్గొని మాట్లాడుతూ… నిజమైన ముంపు బాధితులకు ఆర్థికసాయం అందించకుండా అధికారులు, టీఆర్ఎస్ నాయకులు వ్యవహరించడం సరికాదన్నారు. ముంపు బాధితులకు ఆర్థికసాయాన్ని అందించే విషయంలో పక్షపాత ధోరణి విడనాడాలన్నారు.