ఫ్లిప్‌కార్ట్‌తో జతకలిసిన సాస్టోడీల్!

by Harish |
ఫ్లిప్‌కార్ట్‌తో జతకలిసిన సాస్టోడీల్!
X

దిశ, వెబ్‌డెస్క్: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తూ ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ (flipkart)… ఎంఎస్ఎంఈ(MSME) రంగంలో అడుగుపెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే నేపాల్ ఈ-కామర్స్ దిగ్గజం సాస్టోడీల్ (sastodeal) కంపెనీతో భాగస్వామ్యం కానుంది. సాస్టోడీల్‌కు చెందిన సుమారు 5 వేల ఉత్పత్తులను ఫ్లిక్‌కార్ట్‌లో నమోదు చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

ఒప్పందంలో భాగంగా, ఫ్లిప్‌కార్ట్ సాస్టోడీల్‌కు చెందిన బేబీ కేర్ (baby care products), దుస్తులు (clothes), ఫిట్‌నెస్ ఉత్పత్తులను (fitness products) విక్రయించనుంది. తమ రెండు కంపెనీల కలయిక ద్వారా కస్టమర్లకు సౌకర్యవంతమైన, మెరుగైన సేవలను అందించనున్నట్టు, భారత్‌లో అమ్మకాలు మరింత పెరుగుతాయని ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ కార్యకలాపాలు హెడ్ జగ్‌జీత్ హరొడె తెలిపారు.

అలాగే… ఫ్లిప్‌కార్ట్‌తో కలవడం ద్వారా తాము నేపాల్ కష్టమర్లకు మరింత మెరుగైన, నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించగలమని సాస్టోడీల్ సీఈవో అమున్ థాపా చెప్పారు. అంతేకాకుండా, భారత్, నేపాల్ కస్టమర్ల అభిరుచులు ఒకేలా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్ సంస్థకు సుమారు 2 లక్షల మంది అమ్మకందార్లు ఉన్నారు. సుమారు 50 శాతం ఉత్పత్తులు జైపూర్, లక్నో, లూథియానా, మీరట్, సూరత్, కాన్పూర్, ఆగ్రా, కోయంబత్తూర్, అహ్మదాబాద్ నగరాల నుంచే సరఫరా అవుతున్నాయి.

Advertisement

Next Story