వెనుకటైరు ఊడి… ఓఆర్ఆర్‌పై కారు బోల్తా

by Shyam |
వెనుకటైరు ఊడి… ఓఆర్ఆర్‌పై కారు బోల్తా
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై అతివేగంగా వచ్చిన ఓ కారు వెనుక టైరు ఊడిపడటంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story