విశాఖలో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు అరెస్ట్

by srinivas |
విశాఖలో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు అరెస్ట్
X

దిశ, విశాఖపట్నం: విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించి కాలేజీ విద్యార్థులు, ప్రముఖులకు విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ విక్రయంపై పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు శనివారం రాత్రి స్పెషల్ ఆపరేషన్ చేపట్టి.. అరవింద్ అగర్వాల్, కనపర్తి సాహిల్, బిల్లా చంద్రశేఖర్, మైఖేల్ వెల్ కం, మురళీధర్‌ను అదుపులోకి తీసుకొని, 27బాట్ల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 21న డ్రగ్స్ స్మగ్లర్‌ సర్వేశ్వర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. సెల్‌ఫోన్‌లోని నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed