గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురి అరెస్ట్

by Shyam |
గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురి అరెస్ట్
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురిని భీంగల్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం భీంగల్ ఎస్సై శ్రీధర్ రెడ్డి తన సిబ్బందితో జాగిర్యాల్ ఎక్స్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక క్విడ్ కారులో ఐదుగురు వ్యక్తులు అనుమానస్పదంగా సంచరిస్తుండగా పట్టుకున్నారు. వారిని ఆపి తనిఖీ చేయగా కారులో ఒక కవర్‌లో గంజాయ్ బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి గంజాయి, కారు, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story