- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పక్కాస్కెచ్.. భర్త, ఇద్దరు పిల్లలు దారుణ హత్య.. చివరకు తానూ!
దిశ, వెబ్డెస్క్ : అనుమానం ఆ ఇంట్లో ఎన్నడూ చూడని విషాదాన్ని నింపింది. కూర్చోని సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోకపోవడంతో ఆ అనుమానం పెనుభూతంలా మారింది. అసలు విషయాన్ని నిర్దారించుకోకుండా భర్త తీసుకున్న తొందరపాటు నిర్ణయం మొదటి భార్యకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అది కాస్త కక్ష సాధింపు చర్యగా మారి ఇద్దరు పిల్లలతో పాటు అతని ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. ఆపై మొదటి భార్య (నిందితురాలు) కూడా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించింది.
ఈ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగులోకి రాగా, స్థానికంగా సంచలనం రేపింది. వివరాల్లోకివెళితే.. మొదటి భార్య ప్రసన్న మీద అనుమానంతో భర్త ప్రదీప్ రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే, ప్రదీప్ కుటుంబంపై మొదటి భార్య కక్షపెంచుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రసన్నకు భర్త ప్రదీప్ కుటుంబం మధ్య ఆస్తి వివాదం చెలరేగింది. దీంతో పక్కా ప్లానింగ్ ప్రకారం.. భర్త ప్రదీప్తో పాటు అతని రెండో భార్య పిల్లలిద్దరినీ ప్రసన్న దారుణంగా హత్య చేసింది. ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో పాటు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.