- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలి ఎస్టీ పురోహితుడు ఎక్కడంటే..
దిశ, వెబ్ డెస్క్: కేరళలో షెడ్యూల్డ్ ట్రైబ్(ఎస్టీ)కి చెందిన వ్యక్తి తొలిసారిగా పౌరోహిత్యాన్ని చేపట్టనున్నారు. దక్షిణ కేరళలో సుమారు 1,200 దేవస్థానాలను పర్యవేక్షిస్తున్న ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) పార్ట్ టైమ్ బేసిస్‌లో పురోహితులను నియమించుకుంటున్నది. ఇందులో భాగంగా 19 మంది నిమ్నకులాలకు చెందినవారిని నియమించనున్నట్టు నిర్ణయించింది. 18 మంది ఎస్సీలు, ఒక ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని పార్ట్ టైమ్ ఆలయ పూజారిగా నియమించనుంది.
టీడీబీ పరిధిలోని ఓ ఆలయంలో తొలిసారిగా ఒక ఎస్టీ వ్యక్తిని పురోహితుడిగా నియమిస్తున్నట్టు రాష్ట్ర దేవస్వోమ్ మినిస్టర్ కడకంపల్లి సురేంద్రన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. స్పెషల్ రిక్రూట్‌మెంట్‌లో నిమ్న కులాలవారిని పౌరోహిత్యానికి నియమిస్తున్నట్టు వివరించారు. ఎస్సీ, ఎస్టీల నుంచి పూజారులను తీసుకోవడానికి సరిపడా అభ్యర్థులు లేరని పేర్కొనడం గమనార్హం. కాగా, గత నాలుగున్నరేళ్లలో 133 మంది బ్రాహ్మణేతరులను దక్షిణ కేరళలోని ఆలయాల్లో పురోహితులుగా నియమించినట్టు అధికారికవర్గాలు తెలిపాయి.