ఈశాన్య రాష్ట్రాల్లో మొదటి కరోనా కేసు

by Shamantha N |
ఈశాన్య రాష్ట్రాల్లో మొదటి కరోనా కేసు
X

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో మొదటి కరోనా కేసు నమోదైంది. ఇటీవలే యూకే నుంచి తిరిగొచ్చిన 23 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ గా తేలడంతో ఇన్నాళ్లు ఈ వైరస్ నుంచి సురక్షితంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలకూ ఈ మహమ్మారి వ్యాపించినట్టయింది. యూకేలో చదువుకుంటున్న మణిపూర్ యువతి ఇంటికి చేరుకున్నాక కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో ఆ యువతిని ఐసోలేషన్ వార్డ్ కు తరలించారు ఆమె కుటుంబీకులనూ క్వారంటైన్ లో ఉంచారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మణిపూర్ సర్కారు సోమవారం నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

Tags: coronavirus, northeast states, manipur, UK, lockdown, youth, first case

Advertisement

Next Story