బిగ్ బ్రేకింగ్ : భద్రాద్రిలో భారీ అగ్నిప్రమాదం.. మహిళ సజీవ దహనం

by Sumithra |   ( Updated:2023-05-19 08:22:24.0  )
బిగ్ బ్రేకింగ్ : భద్రాద్రిలో భారీ అగ్నిప్రమాదం.. మహిళ సజీవ దహనం
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ముత్యాలమ్మ గుడి ఏరియాలో సుమారు 9 మంది నివాసముంటున్న ఓ ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళ్ళితే.. భీమయ్య అనే వ్యక్తి ఇంట్లో బాణాసంచాలు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించి ఇళ్లు పూర్తిగా దగ్ధమైందని విశ్వసనీయ సమాచారం. ఈ ప్రమాదంలో కుర్మా భీమశంకర్ భార్య భవాని సజీవ దహనమైనట్టు తెలుస్తోంది. కుమారుడు చంద్ర పూర్తిగా కాలిపోయి కొనఊపిరితో కొట్టుకుంటుండగా స్థానికులు హాస్పిటల్‌కు తరలించారని సమాచారం.
అనంతరం స్థానికులు ఫైర్ ఇంజిన్‌కు, పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే బూర్గంపాడు ఎస్సై జితేందర్ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకొని ఫైర్ ఇంజన్ సిబ్బంది సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.

సమీపంలోని మహిళ లీలా కుమారి కథనం..

కుర్మా భీమశంకర్, అతని భార్య భవాని కుమారులు చంద్ర, ప్రశాంత్, వారి పనిమనిషి అద్దెకు ఉండే వారితో సహా మొత్తం తొమ్మిది మంది నివాసం ఉంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో భీమశంకర్ భార్య భవాని, కొడుకు చంద్ర ఇంట్లోనే ఉండటం వలన మంటల్లో చిక్కుకొని భవాని పూర్తిగా సజీవ దహనమయ్యారు. చంద్ర సుమారు 60 శాతం కాలిన గాయాలతో స్థానికుల సాయంతో హాస్పిటల్‌కు తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story