- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంజనపై కేసు నమోదు చేసిన పోలీసులు
దిశ, సినిమా : సంజనా గల్రానీ మరోసారి చిక్కుల్లో పడింది. శాండల్ వుడ్ డ్రగ్ కేసులో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన ఆమె.. ఆ తర్వాత కరోనా పాజిటివ్‌తో సఫర్ అయింది. ఈ క్రమంలో కొత్తగా మరో ఇబ్బంది వచ్చి పడింది. 2019లో తనకు వ్యతిరేకంగా ఫైల్ అయిన కేసు ఇప్పుడు కష్టాలు తెచ్చిపెడుతోంది. బెంగళూరు లవెల్లే రోడ్‌లోని క్లబ్‌లో మోడల్ వందనా జైన్, సంజనకు మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గొడవ జరిగిన నెక్స్ట్ డే వందన.. సంజన తనను అవమానించడంతో పాటు బెదిరించిందని.. మద్యం బాటిల్‌తో కొట్టి గాయపరిచిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై కోర్టులో తర్వాత విచారణ కూడా జరిగింది. కాగా రెండేళ్ల తర్వాత ఇప్పుడు కోర్టు సూచనల మేరకు కబన్ పార్క్ పోలీసులు సంజనపై ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. దీంతో సంజనకు మళ్లీ అరెస్ట్ చేస్తారేమో అనే భయం పట్టుకుంది.