- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జర్నలిస్టులకు అండగా.. ప్రెస్ క్లబ్
దిశ, న్యూస్ బ్యూరో: సమాజహితం కోసం పనిచేస్తూ కరోనా బాధితులుగా మారకుండా జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచించారు. ఢిల్లీలో కరోనా పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులకు తక్షణ సాయంగా రూ.20 వేలు, క్వారైంటైన్‌లో ఉన్నవారికి రూ.10 వేలు అందించనున్నట్టు అకాడమీ చైర్మన్ శనివారం ప్రకటించారు. ఢిల్లీలోని జర్నలిస్టులతో ఫోన్‌లో మాట్లాడిన చైర్మన్.. జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటామని, ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని తెలిపారు. జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేయించేవిధంగా చూడాలని టీయూడబ్ల్యూజే ఢిల్లీ నాయకులు లెంకల ప్రవీణ్ రెడ్డి, ప్రదీప్‌లకు ఈ సందర్భంగా అల్లం నారాయణ సూచించారు. కరోనా బారిన పడిన జర్నలిస్టుకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ప్రకటించిన 10టీవీ యాజమాన్యానికి మీడియా అకాడమీ చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు.
Tags: Telangana, Allam, Corona,Delhi,Journalists