- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్థిక సవాళ్లు ముందున్నాయి : సీఎంఐఈ!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థికవ్యవస్థ బలంగా పుంజుకుందని భారత ఆర్థిక వ్యవస్థ అధ్యయన కేంద్రం సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) తెలిపింది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా దేశీయ వ్యాపారాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ప్రకటించిన వివిధ సహాయక చర్యలు ఎంతో దోహదపడ్డాయని సీఎంఐఈ అభిప్రాయపడింది.
జూన్ త్రైమాసికంలో ప్రారంభమైన అన్‌లాక్ ప్రక్రియ సెప్టెంబర్ త్రైమాసికానికి జీడీపీ మెరుగుపడేందుకు సహాయపడిందని, 2017 డిసెంబర్ స్థాయికి జీడీపీ చేరుకుందని పేర్కొంది. కఠినమైన కొవిడ్-19 వ్యాప్తి, లాక్‌డౌన్ తర్వాత ఆర్థికవ్యవస్థ ఆరేళ్ల క్రితం ఉన్న రూ. 26.9 లక్షల కోట్ల పరిమాణానికి చేరుకుంది. అయితే, అన్‌లాక్ ప్రక్రియ ద్వారా ఒక త్రైమాసికంలోనే ఆర్థికవ్యవస్థ రూ. 6.2 లక్షల కోట్లను తిరిగి పొందగలిగిందని సీఎంఐఈ ఆర్థికవేత్త మనసి స్వామి చెప్పారు. జూన్ త్రైమాసికం నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి భారత ఆర్థికవ్యవస్థ బలంగా బౌన్స్ బ్యాంక్ అయ్యిందని, అయితే, రానున్న రోజుల్లో మరిన్ని కొత్త సవాళ్లు ఉన్నాయని సూచించారు.
జూన్ త్రైమాసికంలో నమోదైన 23.9 శాతం ప్రతికూలత నుంచి రెండో త్రైమాసికంలో 7.5 శాతం ప్రతికూలానికి చేరుకోవడంతో భారత ఆర్థికవ్యవస్థ సాంకేతికంగా మాంద్యంలోకి పడిపోయిందని సీఎంఐఈ తెలిపింది. లాక్‌డౌన్‌తో పాటు ఆర్థికవ్యవస్థ ఎదుర్కొన్న కరోనా తీవ్రతను బట్టి మాంద్యం అనివార్యం. అయితే, లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన జీడీపీ సంఖ్యలను గమనిస్తే రికవరీ చాలా వేగంగా జరిగిందని మనసి స్వామి పేర్కొన్నారు.