ఫుల్ హ్యాపీగా సమంత.. థ్యాంక్స్ అంటూ వారికి ట్వీట్

by Anukaran |   ( Updated:2021-12-09 23:28:36.0  )
ఫుల్ హ్యాపీగా సమంత.. థ్యాంక్స్ అంటూ వారికి ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్ : స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో ఎంతో మంది మనసు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. వరస సినిమాలతో దూసుకెళ్తోంది. అటు సినిమాలు ఇటు వెబ్ సిరీస్‌లతో తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుంది. ఎన్నో భిన్నమైన పాత్రలు చేస్తూ ఆమె తప్ప ఈ పాత్రలను ఇంకెవ్వరూ చేయలేరేమో అనేంత గొప్పగా ఆడియెన్స్‌ని మెప్పించింది. రంగస్థలం లాంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తోనే కాకుండా మనం, ఓ బేబి, మజిలి లాంటి చిత్రాలతోనూ సమంత ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది.

ఇదే కాకుండా మొదటి సారిగా సామ్ ఓ వెబ్ సిరీస్‌లో నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఎన్నో విమర్శల తర్వాత తెరపైకి వచ్చిన ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో రాజీ అని పాత్రలో సమంత ఒదిగిపోయి తన నటనతో ఎంతో మంది ప్రశంసలను పొందింది. ఇప్పుడు ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. ది ఫ్యామిలీ మాన్ సీజన్ 1′ కు కొనసాగింపుగా దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే రూపొందించిన ది ఫ్యామిలీ మాన్ 2‌లో సమంత ప్రధాన పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక తన కెరీర్‌లో ఎప్పుడూ చేయని ఓ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు ఓటీటీ నుంచి ది బెస్ట్ నటుల ఫీమేల్ జాబితాలో ‘ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2’లో నటనకు గానూ సమంతకు అవార్డు లభించినట్టు స్వయంగా ఫిల్మ్ ఫేర్ వారు అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దీంతో సామ్ సంతోషంతో థ్యాక్స్ అంటూ రీ ట్వీట్ చేసింది.

https://twitter.com/Samanthaprabhu2/status/1468996813076066306?s=20

Advertisement

Next Story