- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మాతో కాదు.. కొవిడ్‌తో పోరాడండి : సంయుక్త కిసాన్ మోర్చా
న్యూఢిల్లీ: నాలుగు నెలలుగా మొక్కవోని దీక్షతో పోరాడుతున్న రైతులపై నిందలు మోపుతూ.. అన్నదాతల పోరాటాన్ని అబాసుపాలు చేస్తున్న కేంద్రప్రభుత్వం తమతో కాకుండా దేశంలో విజృంభిస్తున్న కరోనాపై పోరాడాలని రైతు సంఘాలు సూచించాయి. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ఒక ప్రకటన విడుదల సోమవారం చేసింది. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలు రద్దయ్యేదాకా తమ పోరాటాన్ని ఆపేది లేదని ఎస్‌కేఎం స్పష్టం చేసింది. ‘ఢిల్లీ సరిహద్దుల్లో అయినా దేశంలో మరేచోట అయినా సాగు చట్టాలను రద్దు చేసినప్పుడే రైతులను ఆందోళనలు విరమిస్తారు. అప్పటిదాకా విశ్రమించేది లేదు. ఒకవేళ ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ ఉంటే వారి డిమాండ్ల సాధనకు ముందుకురావాలి’ అని పేర్కొంది. కేంద్రం మొండిపట్టుదలతో సుమారు 375 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఒంటెద్దు పోకడలకు పోకుండా వారి ఆందోళనను అర్థం చేసుకోవాలని కేంద్రానికి సూచించింది. రైతులు పోరాటం చేస్తున్న ఢిల్లీ సరిహద్దుల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎస్‌కేఎం డిమాండ్ చేసింది. దాంతోపాటు కరోనా రెండోదశ విజృంభిస్తున్న తరుణాన వలసకూలీలు, పేదలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.