మహిళా అధికారి కంట్లో కారం చల్లి.. చైన్ స్నాచింగ్

by Shyam |
మహిళా అధికారి కంట్లో కారం చల్లి.. చైన్ స్నాచింగ్
X

దిశ, మహబూబాబాద్ : నెల్లికుదుర్ మండలంలోని ఆలేరు గ్రామ వ్యవసాయ విస్తీరణ అధికారిని ప్రతిభ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చైన్ స్నాచింగ్ పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లాలో వణుకుపుట్టిస్తున్నది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లికుదుర్ మండలంలోని ఆలేరు గ్రామంలో ఉన్న రైతు వేదికలో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయం లోపలి వచ్చి తమ భూమి వివరాలు కావాలని అడిగినట్లు తెలిపింది.

రికార్డులు పరిశీలిస్తున్న క్రమంలో ఓ వ్యక్తి కంట్లో కారం చల్లి దాడి చేసి మెడలోని బంగారు ఆభరణాలను లాగేకెళ్లినట్లు తెలిపింది. ఈ విషయంపై నెల్లికుదుర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఏఈఓ తెలిపారు.

Advertisement

Next Story