జిరాఫీ మృతి : Nehru Zoological Park

by Shyam |   ( Updated:2021-05-27 07:54:18.0  )
జిరాఫీ మృతి : Nehru Zoological Park
X

దిశ, చార్మినార్ : నెహ్రూ జూలాజికల్ పార్క్(Nehru Zoological Park) లో బుబ్లి అనే ఆడ జిరాఫీ స్వల్ప అనారోగ్యం కారణంగా బుధవారం మృతి చెందింది. ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం, బుబ్లి “న్యుమోనియా” తో మృతిచెందినట్లు తెలుస్తోంది. బుబ్లి శరీర లోపలిభాగల అన్ని నమూనాలను సేకరించి పరీక్ష కోసం వీబీఆర్‌ఐకి పంపారు. గత వారం రోజుల క్రితం బుబ్లికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వెటర్నరీ డాక్టర్ల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతూ మృతిచెందింది. బుబ్లి సుమారు 4 సంవత్సరాలు 3 నెలల వయస్సు ఉంటుంది. జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా బుబ్లిని 2019 లో హైదరాబాద్ జంతుప్రదర్శనశాలకు తీసుకువచ్చారు. సీసీఎంబీ లాకోన్స్ అధికారుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది.

జూ లో మిగిలినవి ఇంకా రెండు మగ జిరాఫీలు మాత్రమే..

నెహ్రూ జులాజికల్ పార్కులో బుబ్లి అనారోగ్యంతో మృతిచెందడంతో జూలో ఉన్న మొత్తం మూడు జిరాఫీలలో ఇంకా రెండు మగ జిరాఫీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. జూలో ఉన్న ఇంకా రెండు మగ జిరాఫీల కలయికకు మరో ఆడ జిరాఫీ కొత్తగా వచ్చే వరకు విరహవేదన తప్పేటట్లు లేదు.

Advertisement

Next Story

Most Viewed