- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ రికార్డ్ సృష్టించిన జుట్టు.. ఆనందంలో క్రీడాకారిణి
దిశ, ఫీచర్స్ : అమ్మాయిలకు జుట్టు మీద ఎంతటి ప్రేమ ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. మగువ అందంలో ఎనలేని పాత్ర పోషించే జుట్టులో ఓ నాలుగు వెంట్రుకలు రాలిపోతేనే తెగ బాధపడిపోతుంటారు. కానీ కొందరు దానికి భిన్నంగా కేన్సర్ రోగుల కోసం తమ జట్టు మొత్తాన్ని దానం చేసి తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ స్వ్కాష్ క్రీడాకారిణి బారెడు పొడవున్న తన జుట్టును దానం చేసి గిన్నిస్ రికార్డ్ నెలకొల్పింది. క్యాన్సర్ సోకిన రోగులు రేడియేషన్, కీమో థెరపీతో పూర్తిగి జుట్టు కోల్పోయే పరిస్థితి చూసి చలించిపోయిన ఆమె తన కేశాలను దానం చేసి మానవత్వం చాటుకుంది.
నార్తర్న్ వర్జీనియాకు చెందిన ప్రొఫెషనల్ స్క్వాష్ క్రీడాకారిణి జహాబ్ కమల్ ఖాన్ కొన్నేళ్ల క్రితమే పాకిస్తాన్‌కు వలస వచ్చింది. అక్కడే నివాసముంటున్న ఆమె 18ఏళ్ల నుంచి తన హెయిర్‌కట్ చేయించుకోకుండా పెంచిన 6 అడుగులు, 3 అంగుళాల జుట్టును చిల్డ్రన్ విత్ హెయిర్ లాస్ అనే అమెరికన్ ఆర్గనైజేషన్‌కి దానం చేసింది. ఈ క్రమంలో అతి పొడవైన జుట్టును డొనేట్ చేసిన వ్యక్తిగా ప్రపంచ రికార్డ్ సృష్టించింది. 13ఏళ్ల వయసులో తన తండ్రి ఆలోచన జీవితాన్ని మార్చివేసిందని, ఆనాటి నుంచి తన కలను సాకారం చేసుకునేందుకు వేచి చూశానని జహాబ్ ఖాన్ తెలిపింది. ‘నా చిన్న జుట్టును చూసి నేను చాలా భయపడ్డాను కానీ క్యాన్సర్ పేషెంట్స్‌కు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. మా అమ్మమ్మ చెప్పినట్లు హెయిర్ ఆయిల్ ఉపయోగించడమే నా పొడవాటి కురుల రహస్యం’ అంటూ జహాబ్ తెలిపింది.