కామాంధుడిలా మారిన తండ్రి.. కూతురిపై అత్యాచారం

by Anukaran |
కామాంధుడిలా మారిన తండ్రి.. కూతురిపై అత్యాచారం
X

దిశ, ఏపీ బ్యూరో: కూతురుని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తండ్రి కామాంధుడిలా మారాడు. 14 ఏళ్ల కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ సంఘటన చిత్తూరు జిల్లా రేణిగుంటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రేణిగుంట మండలానికి ఓ వ్యక్తి తన కుమార్తెను తిరుపతిలో వైద్యపరీక్షల కోసమని అక్టోబరు 24న ఇంటి నుంచి తీసుకెళ్లాడు. రేణిగుంట తిరుపతి మార్గంలోని లక్ష్మీపురం కాలనీకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

ఈ విషయాన్ని తల్లితో లేదా ఇతరులతో ఎవరితో చెప్పినా సహించేది లేదని భయపెట్టాడు. అయితే జరిగిన దారుణాన్ని బాధితురాలు తన తల్లికి చెప్పుకుని బోరున విలపించింది. తల్లి సహాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

Advertisement

Next Story