ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఇతడే

by Anukaran |
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఇతడే
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ సంపన్నుల జాబితాలో అగ్రస్థానాన్ని కొత్త కుబేరుడు సాధించాడు. ఇప్పటివరకు ప్రపంచ అత్యంత ధనవంతుడిగా ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ రెండో స్థానానికి చేరుకున్నారు. ప్రముఖ లగ్జరీ గూడ్స్ కంపెనీ లూయిస్ విటన్ మోట్ హునెసీ(ఎల్‌వీఎంహెచ్) చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని సాధించారు. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం.. బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ మొత్తం ఆస్తుల విలువ 186.4 బిలియన్ డాలర్లతో అగ్రస్థానాన్ని చేరుకున్నారు. మన దేశ కరెన్సీలో ఆయన ఆస్తి విలువ రూ. 13.57 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఎల్‌వీఎంహెచ్ సంస్థ లగ్జరీ గూడ్స్ అమ్మకాలను నిర్వహిస్తుంది. ఈ సంస్థ షేర్లు 765 మిలియన్ డాలర్లు పెరిగిన కారణంగానే బెర్నార్డ్ కుటుంబం జెఫ్ బెజోస్ ఆస్తుల కంటే అధికంగా పెరిగాయి. ఈ కంపెనీ అధీనంలో అనేక బ్రాండ్లను విక్రయిస్తోంది. ఇటీవల ఈ కంపెనీ బ్రాండ్ల మూలధన విలువ పెరిగిపోవడంతో బెర్నార్డ్ ఆస్తులు భారీగా వృద్ధి సాధించాయి. ప్రస్తుతం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఆస్తుల విలువ రూ. 186 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక, ఈ జాబితాలో మూడో స్థానంలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ 147.3 బిలియన్ డాలర్లను కలిగి ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed