నష్ట పరిహారం చెల్లించాల్సిందే.. ధర్నాకు దిగిన రైతులు

by Sridhar Babu |
kataram
X

దిశ, కాటారం : గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో పంట పొలాలు నీట మునిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం, ఇప్పలపల్లి, పలుగుల, కుంట్లం, మద్దులపల్లి, చండ్రుపల్లి, నాగేపల్లి, అన్నారం, గ్రామాల్లో పత్తి పంటలు నీట మునిగాయి.

అంతేకాకుండా కాటారం మండలం గుండ్రాత్ పల్లి, విలాసాగార్, లక్ష్మిపూర్ తదితర గ్రామాలకు సంబంధించిన పత్తి, వరి పంటలు వందల ఎకరాల్లో నీట మునిగిపోయాయి. దీంతో, ఆగ్రహించిన అన్నారం రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సరస్వతీ బ్యారేజి వద్ద ఉన్న ఇరిగేషన్ ఆఫీస్ ముందు బైఠాయించి నష్టపరిహారం చెల్లించాలని ధర్నా నిర్వహించారు.

అడిషనల్ కలెక్టర్, రెవెన్యూశాఖ అధికారులు, పోలీసులు సర్దిచెప్పడంతో ధర్నా విరమించి ఇరిగేషన్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో అడిషనల్ కలెక్టర్ షేక్ రిజ్వాన బాషా రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శోభారాణి, ఎంపీపీ రాణి భాయి, ఎంపీడీవో కృష్ణవేణి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీటీసీ మమత పాల్గొన్నారు.

Irrigation

Advertisement

Next Story

Most Viewed